11 July, 2026 | 2:17 PM

Breaking News

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు   •   మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •  

దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం

11-07-2026 01:46 PM

అధ్యక్షుడిగా అబ్రబోయిన రాజేందర్  ఎన్నిక

దోమకొండ, జూలై 11 (విజయ క్రాంతి): దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం నూతన అధ్యక్షుడిగా అబ్రబోయిన రాజేందర్‌ ను సంఘ సభ్యులు  ఎన్నుకున్నారు. శుక్రవారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అబ్రబోయిన రాజేందర్ గతంలో రెండుసార్లు పాండి సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి, సంఘ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన సభ్యులు మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అబ్రబోయిన రాజేందర్ మాట్లాడుతూ తనపై మరోసారి విశ్వాసం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల సహకారంతో సంఘ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో సంఘం ఇతర బాధ్యతలను కూడా ప్రకటించారు. దైవశెట్టిగా అబ్రబోయిన బాలరాజ్‌ను నియమించగా, సలహాదారులుగా అబ్రబోయిన చిన్న రాజేందర్, సీతారాములు, అబ్రబోయిన చంద్రయ్య, అబ్రబోయిన నరసింహులు, అబ్రబోయిన చిన్న రాజయ్య, అబ్రబోయిన సత్తయ్య, అబ్రబోయిన మహంకాళి, బావగారి సత్యం, అబ్రబోయిన శ్రీనివాస్ తదితరులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పాండి సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడిని అభినందించారు.