11 July, 2026 | 2:17 PM

Breaking News

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు   •   మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •  

ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

11-07-2026 01:45 PM

అచ్చంపేట : టనాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం పరిశీలించారు. ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా, అనర్హుల ఓట్లు జాబితాలో ఉండకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి బీఎల్‌వో రోజుకు 60 మంది ఓటర్ల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు మాత్రమే ఉండాలని, డీఎస్‌ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లను గుర్తిస్తున్నామన్నారు. రెండు,  అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.