calender_icon.png 30 September, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమావళి పాటించాలి

30-09-2025 12:07:15 AM

  1. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఆదేశం
  2. స్థానిక సంస్థలకు ఎన్నికలు షెడ్యూలు
  3. అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలి

నిర్మల్/ కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెం బర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎన్నికల షెడ్యూలు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లో ఎన్నికల నిర్వహణపై మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో గ్రామపంచా యతీ ఎంపీటీసీ జడ్పిటిసి జడ్పీ చైర్మన్ ఎన్నికల షెడ్డులు ప్రకటించడం జరిగిందని తెలి పారు.

జిల్లాలో 400 గ్రామపం చాయతీలో మూడు విడుదలగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని రెండో విడత 21న మూడో విడత 25న ఎన్నికల నామినేషన్లు ఉంటాయి తెలిపారు. మొత్తం ఓటర్లు నాలు గు 4:49 302 ఓటర్లు ఉన్నారని ఉన్నారు అదేవిధంగా జిల్లాలోని 18 జడ్పిటిసి 157 ఎంపీటీ స్థానాలను  రెండు విడుదల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపా రు. ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని ఎన్నికలకు కూడా అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరు ఎన్నికల నియామావళి సూచించారు.

ప్రభుత్వ ప్రకటించిన షెడ్యూల్ ప్రకా రం ఎన్నికల నిర్వహణను పక్కగా నిర్వహించేందుకు పక్కగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు సరిహద్దు ప్రాం తాలు చెక్పోస్టులు ఉంటాయని సమాసాత్మక కేంద్రాల్లో పోలీసు రక్షణ భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఎన్నికల సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజా నెంబర్ డిఆర్‌ఓ రత్న కళ్యాణి డిపిఓ శ్రీనివాస్ జడ్పి సీఈవో గోవిందు పాల్గొన్నారు.

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో 2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు- 2025 ,జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికల నిర్వహణలో భాగంగా  రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందించిన శిక్షణ కార్యక్రమానికి కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ.. 2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధి కారుల పాత్ర కీలకమైనదని తెలిపారు. నోటిఫికేషన్ విడుదల అయినందున ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబ డి విధులు నిర్వహించాలని తెలిపారు.

అధికారులు తమకు ఇచ్చిన హ్యాండ్ బుక్‌ను క్షుణ్ణంగా చదివి ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నిర్వహణ ప్రక్రియలో ఏమై నా సందేహాలు, అపోహలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.