calender_icon.png 30 September, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరమ్మ మళ్లీ రావమ్మా

30-09-2025 12:08:52 AM

  1. అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు
  2. కుటుంబ సమేతంగా హాజరైన ఎస్పీ కాంతిలాల్ పాటిల్
  3. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్ అభిలాష అభినవ్

కుమ్రం భీం ఆసిఫాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృ తి సాంప్రదాయానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుక జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలను సేకరించి ఇండ్ల లో బతుకమ్మలను పేర్చారు. ఆయా ఆలయా ల్లో, గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. అనంతరం డీజే చప్పుళ్లు, బ్యాండు మేళాలతో శోభాయాత్రగా బతుకమ్మలను తీసుకవెళ్లి స్థానిక వాగు లు, చెరువులలో నిమజ్జనం చేశారు.సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. హరిహరి దేవ ఉయ్యా లో.. హరియో బ్రహ్మదేవ ఉయ్యాలో.. అం టూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. ఆలయ ప్రాంగణాల్లో, కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆటల సందడి కనువిందు చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు సాంప్రదాయ ఏకరూప వస్త్రాలంకరణతో గౌరమ్మలకు ప్రత్యేక ప్రజలు నిర్వహించి,

వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. బతుకమ్మల వద్దమహిళలు లయ బద్దంగా ఆడుతూ.. పాడుతూ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పోటీపడి విభిన్న రూపాల్లో బతుకమ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు. నూతన వస్త్రాలు, నగలు ధరించి ఒక్క చోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడడంతో పాటు యువతులు, మహిళలు కోలాటం, దాండియా ఆటలు ఆడారు.

పట్టణంలోని బ్రాహ్మణవాడ, కన్యకాపరమేశ్వరీ ఆలయం, పొట్టి శ్రీరాములుచౌక్, పైకాజీనగర్, సందీప్ నగర్, జన్కాపూర్, బజార్వాడీ, బనార్ బొగడ, కంచుకోట, టీఆర్నగర్, రావులవాడ, హడ్కోకాలనీ, దస్నాపూర్ ప్రాంతా ల్లో అర్ధరాత్రి వరకు బతుకమ్మ ఆటలు ఆడి తెల్లవారుజామున బతుకమ్మలను స్థానిక పెద్దవాగులో నిమజ్జనం చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు శాఖ పట్టిష్ట బందోభస్తు చేపట్టింది.

జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు..

జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగగా జరగాయి. ఎస్పీ కాంతిలాల్ పాటిల్  కుటుంబ సమేతం గా హాజరై పోలీస్ అధికారులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, కుటుంబాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఈ వేడుకలు మంచి వేదికగా నిలుస్తాయన్నారు.

వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు, హోం గారడ్స్, సిబ్బంది పాల్గొని పూలను పూజిస్తూ, పాటలు పాడుతూ సంబరాల్లో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, మహిళా ఎస్త్స్రలు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియంలో..

నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సద్దుల బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ కలెక్టర్ అభిలాష అభినవ్, డిఆర్డిఓ విజయలక్ష్మి మహిళలు పెద్ద సంఖ్యలో రంగం తరలివచ్చి కోలాటం చేస్తూ బతుకమ్మ ఆటలు ఆడి పాడారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ఒక గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహిళలు పాల్గొన్నారు.