ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి
ఘట్‌కేసర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి
ఘట్ కేసర్, జూలై 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రైతు సహకార సంఘాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సహకార సంఘాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా, అడ్డదారుల్లో డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నారు.
ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రైతుల హక్కులను, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ వెంటనే పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో రైతు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






