17 July, 2026 | 12:47 AM

పార్కు కబ్జా.. హైడ్రా విముక్తి

17-07-2026 12:00 AM

హయత్‌నగర్ డివిజన్ వెంకటాద్రి కాలనీలో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారులు 

ఎల్బీనగర్, జులై 16 : ప్రజలకు ఉపయోగపడే పార్కును కొందరు కబ్జా చేశారు. పార్కును కబ్జా నుంచి విముక్తి చేయాలని స్థానికులు, నాయకులు పదమూడు ఏండ్లు గా చేసిన పోరాటం ’హైడ్రా’ సహకారంతో పార్కును దక్కించుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి హయత్ నగర్ డివిజన్ లోని ఇన్ఫర్మేషన్ కాలనీలో వెంకటాద్రి నగర్ లో ఉన్న 1200 గజాల పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. స్థానికులు విషయాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మధుయాష్కీ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ ఆదేశాలతో తెలంగాణ యాద వ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలతో ఎల్బీ నగర్ జోనల్ మాజీ కమిషనర్  హేమంత్ కే శవ్ పాటిల్, ప్రస్తుత కమిషనర్ వికాస్ మహాతోకు వెంకటాద్రి నగర్ కాలనీవాసులు పూ ర్తి ఆధారాలను అధికారులకు అందజేశారు. పార్కు స్థలాన్ని కాపాడుకోవడానికి సుమా రు పదమూడు సంవత్సరాలు పోరాడుతున్నారు.

చివరికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ మేరకు గురువారం హయత్ నగర్ పోలీసుల సాయంతో పార్కు చూట్టు వేసిన ప్రీకాస్ట్ నిర్మాణాన్ని జేసీబీ సాయంతో కూల్చివేశారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులకు తెలంగాణ యాదవ్ కో-ఆపరేటివ్ కా ర్పొరేషన్ వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  వెంక టాద్రి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.