calender_icon.png 3 December, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి

03-12-2025 12:00:00 AM

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

వికారాబాద్, డిసెంబర్- 2: వికారాబాద్ జిల్లా వికారాబాద్, నవాబ్ పెట్ మండలాల్లో  నామినేషన్ స్వీకరణ కేంద్రాలను  ఎన్నికల  సాదారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష తనిఖీ చేశారు.  మంగళవారo వికారాబాద్ మండలం సిద్దలుర్ ,నవాబ్ పేట్ మండలం నవాబ్ పెట్, ఏక్మామిడి  గ్రామ పంచాయతీ కార్యాలయాలలో  నిర్వహిస్తున్న  ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియ ను పరిశీలించారు.

ఎన్నికలను పురస్కరించుకుని  గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వికరణ కేంద్రాలను పరిశీలించారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ను  పరిశీలించారు. అవసరమైన వారికి  హెల్ప్ డెస్క్ ద్వార సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని,  విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి  తప్పకుండా అమలయ్యేలా చూడాలని, నిర్నీత గడువు లోపల నామినేషన్ లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు  ఖర్చుల వివరాలపై పూర్తి అవగాహన కలిపించాలన్నారు.

వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్  ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు.  అనంతరము  కల్లెక్ట్రేట్ కార్యాలయములో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు,  ఇప్పటి వరకు ఎన్ని కాల్స్ వచ్చాయి,  వివరాలు అడుగుతూ రిజిష్టర్ లో తప్పని సరిగా నమోదు చేయాలనీ సూచించారు. సాదారణ పరిశీలకులతో పాటు జిల్లా పంచాయతి అధికారి జయసుధ, డి ఎస్ పి శ్రీనివాస్ రెడ్డి,  ఆర్ డి ఓ వాసు చంద్ర, డిప్యూటీ కలెక్టర్  పూజ ,ఎం పి డి ఓలు నవీన్ కుమార్, అనురాధ సంబంధిత అధికారులు , తదితరులు ఉన్నారు.