03-12-2025 12:00:00 AM
మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్
మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 2 (విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ నిబంధనలను అతిక్ర మిస్తే ప్రమాదాలు ఆయన చెప్పారు. మేడ్చల్ పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ట్రాఫిక్ సిఐ వెల్లడించారు.
అంతే కాకుండా ట్రాఫిక్ నిబంధనలో పౌరుల ప్రయోజన కొరకు ఏర్పాటు చేయబడినవని వాహనదారులు కాలినడకన వెళ్లే వారికి ప్రమాదాలు జరగకుండా నిబంధనలు రూపొందించబడ్డాయని ఆయన అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ మధుసూదన్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్త్స్ర పరశురాం, కళాశాల కరస్పాండెంట్ కమలాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ దేవరాజ్, డైరెక్టర్ లు గణేష్, సత్యనారాయణ అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.