calender_icon.png 3 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్లగూడ చెరువు సుందరీకరణ పనులు

03-12-2025 12:00:00 AM

గుర్రపు డెక్క తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్ 

ఎల్బీనగర్, డిసెంబర్ 2 : నాగోల్ డివిజన్ లోని బండ్లగూడ చెరువు శుద్ధీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం చెరువులో వ్యర్థాల తొలిగింపు పనులను కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ పరిశీలించారు. నాగోల్ డివిజన్ పరిధిలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ సంరక్షణ, చెరువుల పునరుజ్జీవనానికి చెరువు శుభ్రతతోపాటు గుర్రపు డెక్క తొలిగింపుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

చెరువులో జరుగుతున్న శుభ్రత కార్యక్రమాలు, నీటి నాణ్యత, నీటి మట్టం మరియు చెరువు లోపల పెరిగిన గుర్రపు డెక్కల వల్ల దోమల పెరుగుదల, ఆంటీ లార్వా సమస్యలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ.. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు, పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్, చెత్త పూర్తిగా తొలగించి చెరువును పునరుద్ధరించాలన్నారు.

చెరువు చుట్టుపక్కల తుమ్మ మొక్కలు, జుల్లమొగ్గలు, దోమల పెరుగుదలకు కారణమయ్యే పిచ్చిమొక్కలను పూర్తిగా తొలగించాలి సూచించారు. చెరువు పరిసరాల్లో ఫాగింగ్ డ్రైవ్ ను ప్రతిరోజూ నిర్వహించాలని ఆదేశించారు. చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణ కోసం క్యాంపోస్టింగ్ యూనిట్, గార్బేజ్ బిన్ల ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, గ్రీన్ కవర్ పెంపు, లైటింగ్ సౌకర్యాలు వంటి పౌర వసతులను దశలవారీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ జనార్దన్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.