14 April, 2026 | 5:21 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి: ఏడీఈ

04-02-2026 12:00 AM

వేములపల్లి, ఫిబ్రవరి 3 : గ్రామాలలో ఉన్న విద్యుత్ సంబంధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏ డి ఈ రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ముల్కపట్నం గ్రామంలో లూజ్ లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో విద్యుత్ సమస్య లేకుండా పరిష్కరించాలని సూచించారు. అదనపు స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి విద్యుత్ తీగలను బిగించాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ల పనితీరును పరిశీలించారు. ఆయన వెంట ఏ ఈ నాగరాజు, సర్పంచి జెర్రీ పోతుల మౌనిక సురేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ పాండు, రాచూరి వెంకన్న, సోమనబోయిన సైదులు, లైన్మెన్ సతీష్ తదితరులున్నారు.