04-02-2026 12:00:00 AM
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 3: మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారంలో అంబర్ ప్యాకెట్ గుట్కా రావడాన్ని ఖండిస్తూ.. మంగళవారం బిఆర్‌ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంజియూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ కి అందజేశారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పడిన నుండి పలు సమస్యలతో తాండవిల్లుతోంది అని ఈ రెండు సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ హాస్టల్లో కలుషిత ఆహారం రావడం ఇది 6వ సారి అని తెలిపారు.
విద్యార్థుల భోజనం అనేకసార్లు కలుషితం కావడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. కలుషిత ఆహార సంఘటనలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీ కళాశాలలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం జి యూనివర్సిటీ నాయకులు గాదె శివ, చలకాని పరమేష్, కన్నబోయిన వంశీ, దాసరి మచ్చ గిరి, రాంబాబు, మహేష్, సైదులు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.