calender_icon.png 19 January, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మరోచోటికి మార్చాలి

19-01-2026 06:58:21 PM

ఏడాదిగా గిరిజన రైతుల వేడుకలు

పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో రెండు చెరువుల మధ్యలో ఉన్న 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరో చోటుకు మార్చాలని మండలంలోని లూనావత్ తండా గ్రామపంచాయతీ గిరిజన రైతులు వేడుకుంటున్నారు. ఏడాదిగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్న వారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బాధిత గిరిజన రైతుల కథనం ప్రకారం... లూనావత్ తండా శివారు జమ్మిచెరువు, ఊరగుంట చెరువుల మధ్యలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉంది.

దాని కింద సుమారు 20 మంది రైతులు సాగు చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లే దారి లేకపోవడంతో మరమ్మత్తుల సమయంలో దాని వద్దకు పోలేక రైతులం నానా అవస్థలు పడుతున్నాం. దీంతో సాగు పొలాలని ఎండిపోతున్నాయి. ఈ విషయాన్ని మరిపెడ ఏఈ, డీఈ లకు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో ఏడాది క్రితం వారు సందర్శించి ఐదు పోల్స్ పడతాయని అంచనాలు వేశారు.

మారుస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ నేటి ఏడాది అయిన అధికారులు ఎలాంటి చలనం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను మరోచోటకు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని బాధిత గిరిజన రైతులు లూనావత్ స్వామి ,వీరమల్లు ,సురేష్ గోగ్య సిరి, యాకు తిరుపతి బానోత్ బద్రు, సిరి, రెడ్యా, నాగరాజు ,వేలాద్రి వేడుకుంటున్నారు.