calender_icon.png 19 January, 2026 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి రైతు పట్టా పాస్ బుక్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి

19-01-2026 06:55:01 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): ప్రతి రైతు పట్టా పాస్ బుక్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగరాజు తెలిపారు. రైతు పండించిన పత్తి, వడ్లు అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది కావున మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని అన్నారు. రైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ రిజిస్ట్రేషన్) చేసుకొని రైతులు  ఈరోజు ఉదయం 9 గంటలకు బెజ్జూర్ రైతు వేదిక కి వచ్చి ఆన్లైన్ చేసుకోవాలని తెలిపారు.

ఇట్టి అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు వచ్చేటప్పుడు వెంట ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ తీసుకురావాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే స్వయంగా పట్టాదారు రైతు వచ్చి ఫోటో దిగాలి.రైతు గుర్తింపు కార్డు చేసుకోని రైతులు కచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోవాలి.