13 April, 2026 | 7:01 PM

విద్యుత్ ఉద్యోగుల నిరసన

13-04-2026 05:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్, దినసరి కార్మికులు, ఫీజు వర్క్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం గత ఆరు రోజులుగా తాము సమ్మె చేస్తున్న అధికారులు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నిరంజన్ రాజు ఎస్.కె అశోక్ రాజు మధు శ్రీను స్వామి తదితరులు పాల్గొన్నారు.