18 April, 2026 | 11:00 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

బీటీపీఎస్‌లో విద్యుత్ జేఏసీ ధర్నా

30-05-2025 12:04 AM

మణుగూరు, మే 29 (విజయక్రాంతి) ఉత్తరప్రదేశ్ లోని  విద్యుత్ సంస్థ లను ప్రైవేటీకరించాలానే ప్రయత్నాని నిరసిస్తూ  తెలంగాణ పవర్ ఎంప్లాయిస్  జేఏసీ ఆధ్వర్యంలో బీటీపీ ఎస్ లో గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాడని నిరసిస్తూ పలు నినాదాలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ పవర్ ఇంజనీర్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు కా ర్యదర్శి బి. రవి ప్రసాద్ ప్రసంగించారు.  విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఉద్యోగులందరు ఐక్య ఉద్యమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా డిస్కములను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుందనే  ఆరోపించారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ రాష్ట్ర విద్యుత్ నాయకులపై అప్రజాస్వామికంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులందరు  ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ప వర్ అసిస్టెంట్ ఇంజనీర్ల అసోసియేషన్ రీజినల్ సెక్రెటరీ రవితేజ, బీసీ అసోసియేషన్ నాయకు లు సాయిరాం, కార్మిక సంఘం-1535 రీజనల్ అధ్యక్షులు వి. ప్రసాద్, కార్మిక సంఘం- 327 అధ్యక్షులు బి.కృష్ణ, కార్మిక సంఘం-1104 నాయకులు వెంకట్రాం,  సిఐటియు నాయకులు వీరస్వామి కార్మిక సంఘం నాయకులు ఆర్. రామచందర్, సిద్దెలో హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.