17 April, 2026 | 6:05 PM

గాలి వానకు విరిగిపడ్డ విద్యుత్ స్తంభం

25-06-2025 12:04 AM

పెను ప్రమాదం నుంచి బయటపడ్డ కాలనీ వాసులు 

కొత్తకోట జూన్ 24 : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 13 వ వార్డు వివర్స్ కాలనిలో మంగళవారం గాలి వానకు విద్యు త్ స్తంభం విరిగిపడ్డది. అ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమా దం నుండి బయటపడ్డారు. దింతో బిఆరెస్ అధికార ప్రతినిధి సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ అధికారులకు సమాచారం చేర వేశారు. విరిగిపడ్డ పోల్స్ ను తీసేసి కొత్త పోల్స్ పాతి వెంటనే కాలనికి విద్యుత్ అందించాలని అధికారులను కోరారు. కరెంట్ లేక పోతే చీడ పురుగులు వస్తాయని వెంటనే మ రమ్మత్తులు చేపట్టి కరెంట్ ఇవ్వాలని కోరారు.