16 June, 2026 | 1:37 AM

రైతుల చెంతకే విద్యుత్ సేవలు.!

16-06-2026 12:17 AM

సత్వర పరిష్కారం దిశగా అధికారులు అడుగులు.

టీజీ ఎస్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ వట్టి కొండ శివాజీ 

నాగర్ కర్నూల్ జూన్ 15 (విజయక్రాంతి): మారుమూల గ్రామీణ ప్రాంత రైతులకు సైతం వేగవంతంగా మెరుగైన విద్యుత్తు సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని తెలంగాణ రాష్ట్ర ఎస్పీడీసీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వట్టి కొండ శివాజీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

వినియోగదారు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయలేకపోయినా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా వేగవంతంగా మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు, వాటి పరిష్కారం ఉన్నతాధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదు, పరిష్కారం అయిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ శాఖలో అలసత్వం అక్రమాలకు తావు లేదన్నారు. వారితో పాటు ఎస్‌ఈ నరసింహారెడ్డి, ఎస్‌ఏఓ పార్థసారథి తదితరులు ఉన్నారు.