కౌలు రైతులకు గుర్తింపు కార్డు అవసరం
16-06-2026 12:18 AM
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, జూన్15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అవసరమని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నా రు. సోమవారం రైతు కమిషన్ కార్యాయలంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ ప్రతి కౌలుదారుకు వ్యవసాయ శాఖ నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలని, ప్రతి 11 నెలలకు ఒకసారి కార్డును రెన్యువల్ చేయాలని కోరినట్లు చెప్పారు.






