16 June, 2026 | 1:37 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

16-06-2026 12:15 AM

కల్వకుర్తి, జూన్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రినీ సోమవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి  రోగులు వారి బంధువులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వైద్య సేవల అందుబాటు, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై ఆరా తీశారు.

ఆసుపత్రిలో కొంతమంది సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించడం లేదని, రోగులకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని గుర్తించి సంబంధిత అధికారులు, వైద్యులు, సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని  స్పష్టం చేశారు.

ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లోపం, వైద్య సేవల నిర్వహణలో ఉన్న సమస్యలను  పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆసుపత్రి సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని హెచ్చరించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైద్య సిబ్బందికి సూచించారు.