రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి
17-04-2026 12:37 AM
సీఐ కుమార్
చౌటుప్పల్, ఏప్రిల్ 16 :రోడ్డుభద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని మన్మధ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు.
ఓవర్లోడింగ్, మితిమీరిన వేగం, ప్రమాదకర డ్రైవి్ంప కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు.






