calender_icon.png 31 December, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్విమ్మింగ్ పూల్ పనుల సాగదీత ఇంకా ఎంత కాలం

31-12-2025 10:23:27 AM

కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మినిస్టేడియంలో సంవత్సరాలుగా పూర్తికాని స్విమ్మింగ్ పూల్ పనులను బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు బుధవారం పరిశీలించారు. 2017 సంవత్సరంలో భూమి పూజతో రూ.180 లక్షల వ్యయంతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ, నేటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రి జూపల్లి అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే స్విమ్మింగ్ పూల్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.