31-12-2025 10:21:57 AM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం లోని మరిమడ్ల గ్రామ పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ సమీపంలో డాక్టర్ కిందపడి యువకు వివరానికి వెళితే గుగులోత్ సుకునా భర్త సార్య, వయస్సు 70 సంవత్సరాలు, చింతమణితండ గ్రామం, రుద్రంగి మండలం నివాసి, తన చిన్న కుమారుడు గుగులోత్ గంగాధర్ వయసు 25 సంవత్సరాలు, నివాసం చింతమణితండ గ్రామం, రుద్రంగి మండలం అనునతడు ఇసుక లోడింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు, సోమవారం రోజు రాత్రి సుమారు 9 గంటలకు, మృతుడు గంగాధర్ తన సహచరులతో కలిసి ఇసుక లోడింగ్ పనికి వెళ్లాడు.
అదే రాత్రి మర్రిమడ్ల గ్రామ పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ సమీపంలో, అదే రోజు 11 గంటల సమయంలో, ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా దేగవత్ వినోధ్ , మైనర్ బాలుడైనా డేగవత్ చరణ్ అను అతనికి ట్రాక్టర్ నడిపేందుకు అనుమతించగా, అతడు వేగంగా, నిర్లక్షంగా నిడిపి ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న సమయంలో, గంగాధర్ ట్రాక్టర్ ఇంజిన్ మరియు ట్రాలీ మధ్యనున్న చాసిస్‌పై నిలబడి ఉండగా, రోడ్డులో ఉన్న గుంతల కారణంగా కింద పడిపోయాడు.
వెంటనే ట్రాలీ టైరు అతని తలపై నుండి వెళ్లడంతో తీవ్ర గాయాలు ఆవగా, 108 ఆంబ్యులెన్స్ కు సమాచారం ఇవ్వగా, ఆంబ్యులెన్స్ సంఘటన స్థలానికి చేరుకునే లోపే అంధజ సమయం 11:55 గంటలకు గంగాధర్ గాయాల కారణంగా మృతి చెందినాడు. ట్రాక్టర్‌ను మైనర్ అయిన దేవగవత్ చరణ్ నడిపించగా, అతనికి డ్రైవింగ్ రాకపోయినప్పటికీ ప్రమాదం జరుగుతుందని తెలిసినా దేవగవత్ వినోధ్ అతనికి ట్రాక్టర్ నడిపేందుకు అనుమతించాడని ఆరోపిస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరగా ఎస్ఐ కె. ప్రశాంత్ రెడ్డి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తన్నారు.