calender_icon.png 31 December, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

31-12-2025 10:18:58 AM

నంగునూరు: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నంగునూరు మండల ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని రాజగోపాలపేట ఎస్ఐ టి.వివేక్ కోరారు.వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31 (బుధవారం), జనవరి 1 తేదీల్లో మండల వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. రోడ్లపై కేకులు కట్ చేయడం, అతి వేగంతో వాహనాలు నడపడం, బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ప్రమాదకరమైన చైనా మాంజా విక్రయించినా,వాడినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.యువత ఒక్కరోజు ఆనందం కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు.