పేదల సంక్షేమానికి పదకొండు ఏండ్లు
వాజేడు (విజయక్రాంతి): మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) 11 సంవత్సరాల పరిపాలన విజయాలపై పార్టీ ఆవిష్కరణ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ పార్టీ వాజేడు మండల అధ్యక్షులు పెద్ది జగపతిబాబు(BJP party Vajedu Mandal President Peddi Jagapathi Babu) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్ కుంజా ధర్మ పాల్గొని మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్" విజయంతో దేశ దౌత్య సామర్థ్యం మరోసారి నిరూపితమైందన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వం దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్పి ఇందిరమ్మ కమిటీలతో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం దౌర్భాగ్యం అని, నిరుపేదలైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కందుల రామ్ కిషోర్, ప్రవీణ్, సీతారామరాజు, ఆంజనేయలు, యలం సుబ్బయ్య, తోట శేషు, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.






