15 April, 2026 | 3:13 AM

ఈఎల్వీ ఫౌండేషన్ ఆర్థిక సాయం

17-11-2025 01:27 AM

సంస్థాన్ నారాయణపూర్, నవంబర్ 16 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలం  సర్వేలు గ్రామానికి చెందిన వీరమల్ల వెంకటేష్ వృత్తిరీత్యా కల్లుబండి నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో  కాలు విరిగింది.

ఈ విషయం తెలుసుకున్న ఇఎల్వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ తక్షణమే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబానికి 30000  రూపాయలను ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ చేతులమీదుగా అందజేశారు.కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం  చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇఎల్వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.