calender_icon.png 17 November, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్

17-11-2025 01:27:27 AM

-డిసెంబర్ 8, 9వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్వహణ

-సమ్మిట్ ప్రాంగణాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి

కందుకూరు, నవంబర్ 16 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు బేగరి కంచె ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సమావేశ ప్రాంగణాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్, పలు శాఖల ఉన్నత అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం పరిశీలించారు.

ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందిన ఉన్నత కంపెనీల యాజమాన్యాలు గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజులపాటు ఇక్కడే ఉండి సమావేశంలో పాల్గొని ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క.. సమ్మిట్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.

ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కలసి ఈ ప్రాంతంలో ముందుగా హెలిఫ్యాడ్ ద్వారా ఏరియల్ సర్వే చేసి అనంతరం అక్కడ సమావేశ ప్రాంగణానికి చేరుకునే కుతవేటు దూరంలో ఉన్న హెలికాప్టర్ దిగే స్థలాన్ని సైతం ఆయన పరిశీ లించారు. అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు భట్టి విక్రమార్క పలు సలహాలు, సూచనలు చేశారు. భట్టి వెంట ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్ ఉన్నారు.