17-11-2025 01:29:49 AM
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ముషీరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): జర్నలిస్టులు వార్తలు, వ్యాఖ్యలకు మధ్య గల తేడాను తెలుసుకోవాలని, వ్యక్తిగతమైన అభిప్రాయాలను రాయరాదని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. వయోధిక పాత్రికే యుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణ ’అప్పుడు ఇప్పుడు’, వయోధిక పాత్రికేయ సంఘం ప్రచురించిన ‘అనుభవాలు జ్ఞాపకాలు’ లను వెంకటయ్యనాయుడు ఆవిష్కరించి మాట్లాడారు.
ఈ గ్రంధాలను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, అనాటి సామాజిక ఆర్థిక, రాజకీయ పరిణామాలన్ని కళ్ళముందు కదిలాదాయన్నారు. పాత్రికేయ వృత్తి ఎంతో ముఖ్యమైనదని, ఉష్ణమైనదని, కత్తిమీద సాము లాంటిదని, ఎంతటి భాధ్యతాయుత మైనదో ఈ గ్రంథాల ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు. పత్రికారంగలో మార్పుల ను మేధావుల అనుభవాలను రికార్డు చేసిన కృషి అభినందనీయమన్నారు.
నేటి తరం పాత్రికేయులు మీడియా రంగంలో ఉన్నవారు తప్పనిసరిగా ఈ గ్రంథాలను చదవాలని సూచించారు. గతం లేనిదే వర్తమానం లేదని, వర్తమానం లేనిదే భవిష్యత్తు లేదన్నారు. ఈ రెండు గంథాలు పాతతరం జర్నలిస్టుల అనుభవాలు, విలువలు, వారు ఎదుర్కొన్న సవాళ్ళు నేటి యుతకు మార్తినిస్తాయని చెప్పారు. తాను రాజకీయాల్లో లేనని, రాజకీయ నాయకులు బూతులు మాట్లాడితే పత్రికలు కూడా అదే విధంగా రాయడం మంచిది కాదన్నారు.
జర్మనిష్టులు జర్నలిస్టులు సానుకూల దోరణి కలిగియుండాలని, నెగిటివ్ దోరణి కలిగియుండరాదని, ప్రకృతిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని, మంచి పనులు చేసిన వారిని గుర్తించాలని సూచించారు. సోషల్ మీడి యా యాంటి సోషల్ మీడియాగా మారిందని, బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.
ఈ సభకు సంఘం అధ్యక్షుడు దాసు దేశవరావు అధ్యక్షత వహించగా అత్మీయ అతిధులుగా సీని యర్ సంపాదకులు కె. రామచంద్రమూర్తి, ప్రముఖ పాత్రికేయులు (ఇండియా టుడే ఆంగ్ల పత్రిక)కు పూర్వ సంపాదకులు ఎన్. వెంకటనారాయణ, జి.కృష్ణ కుమారుడు ఇండియా టుడే తెలుగు పత్రికకు పూర్వ సంపాదకులు రాజ శుక, సీనియర్ పాత్రికేయులు పిఏ రామారావు, జెవి. లక్ష్మణ రావు పాల్గొన్నారు.