12 March, 2026 | 2:45 AM

ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

04-11-2024 01:23 AM
  1. మళ్లీ బాంబు బెదిరింపులు
  2. ఫేక్ కాల్‌గా నిర్ధారణ

రాజేంద్రనగర్, నవంబర్ 3: గోవా నుంచి ఆదివారం కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానాన్ని పేల్చివేస్తామని కాల్ రావడంతో పైలట్లు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాం డింగ్ చేశారు. ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, కొందరు కావాలనే ఫేక్ కాల్స్ చేసి బెదిరించారని నిర్ధారించారు.

గతంలో శంషాబాద్ నుంచి బెంగళూరు, పుణె వెళ్లాల్సిన ఇండిగోతో పాటు ఎయిరిండియా విమానాలకూ ఇవే తరహా కాల్స్ వచ్చాయి. వరుసగా విమానాలను పేల్చివేస్తా మంటూ కాల్స్ వస్తుండడంతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతో అధికారులు బెదిరింపు కాల్స్‌పై సీరియస్‌గా విచారణ చేపడుతున్నారు. గత కొన్నిరోజులుగా విమానాలకు ఫేక్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి.