12 March, 2026 | 4:31 AM

మహాత్ముడికి అవమానం

04-11-2024 01:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): జాతిపిత మహాత్మాగాంధీకి అవమానం జరిగింది. దీపావళి రోజు కంటోన్మెంట్ ప్రాంతంలోని గాంధీ విగ్రహం నోటి భాగంలో ఆకతాయిలు పటాకులు పెట్టి కాలుస్తూ వీడియో తీశారు. ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ ‘ఎక్స్’ వేదికగా హైదరాబాద్ సీపీకి ఆ వీడియోను టాగ్ చేసి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు ఎంతోమంది పోలీస్‌శాఖ ఉన్నతాధికారులకు ట్యాగ్ చేస్తున్నారు.