15 April, 2026 | 6:21 AM

టీఎన్జీవోల అత్యవసర సమావేశం

12-06-2025 01:19 AM

సమస్యలపై చర్చ

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): టీఎన్జీవోల అత్యవసర సమావేశం బుధవారం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్. విక్రమ్‌కుమార్ అధ్యక్షతన హైదరాబాద్‌లో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ సభను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలతో పాటు, ఇతర సమస్యల మీద చర్చించారు.

ఈ సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళి రాజు, హైదరాబాద్ జిల్లా కార్యవర్గం అసోసియేట్ అధ్యక్షుడు కెఆర్. రాజ్ కుమార్, కోశాధికారి జె.బాల్రాజ్, ఉపాధ్యక్షుడు ఈ.నరేష్‌కుమార్, జాయింట్ కార్యద ర్శి ఖలీద్ అహ్మద్, సుజాత, గీతా సింగ్, ఈసి మెంబెర్స్ వైదిక శాస్త్ర, ముకీమ్ ఖురేషి,  మాజీ కార్యదర్శి జి.ప్రభాకర్ పాల్గొన్నారు.