16-05-2025 12:28:43 AM
జిల్లా సికిల్ సెల్ నోడల్ అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్
కల్వకుర్తి మే 15: 2047 సంవత్సరం నాటికి భారతదేశంలో సికిల్ సిల్ బాధితులు లేకుండా చేయడమే లక్ష్యంగా భారత ప్రభు త్వం కృషి చేస్తుందని జిల్లా సికిల్ సెల్ నొడల్ అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. గురువారం వెల్దండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా సికిల్ సెల్ నోడల్ అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎంఎల్ హెచ్ పి లకు, ఏఎన్‌ఎం లకు, ఆశా కార్యకర్తలకు పర్యవేక్షణ సిబ్బందికి సికిల్ సిల్ అనీమియాపై అవగాహన,
స్క్రీనింగ్ పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికిల్ సెల్ అనిమియా జన్యుపరమైన లోపం వలన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుందన్నారు. సా ధారణంగా ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుంది, కానీ సికిల్ సెల్ వ్యాధితో బాధపడే వారికి ఎర్ర రక్త కణాల జీవితకాలం 10-20 రోజులు మాత్రమే ఉం టుందని ఇలాంటి వారు తరచుగా రక్తహీనత తో బాధపడుతుంటారని తెలిపారు.
వారితో పాటు వెల్దండ వైద్యాధికారి డాక్టర్ సింధు, ఏపిఓ నిరంజన్, మలేరియా అధికారి పర్వతాలుఎంఎల్ హెచ్పిలు, నవీన్, యాదయ్య , సాయి పవన్, సూపర్వైజర్లు మురళి, కవిత ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మణ్, గోవర్ధన్, ఎఎన్‌ఎం తిరుపతమ్మ, పద్మ, ఎల్ల మ్మ, జానకి, చంద్రకళ, పద్మావతి, జహంగీర్ బి, ఆశా కార్యకర్తలు సుజాత, స్వప్న, యా దమ్మ, వసంత, చంద్రకళ, మండల వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.