calender_icon.png 3 December, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్ట్ మేనేజ‌ర్ వేధింపుల‌తో ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

03-12-2025 09:07:11 PM

* మెద‌క్‌లో విషాద ఘ‌ట‌న‌

* విశాల్ మార్ట్ మేనేజ‌ర్‌పై కేసు న‌మోదు 

మెద‌క్‌ (విజ‌య‌క్రాంతి): మార్ట్ మేనేజ‌ర్ వేధింపులు భ‌రించ‌లేక అందులో ప‌నిచేసే ఉద్యోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మెద‌క్ జిల్లా కేంద్రంలో బుధ‌వారం జ‌రిగింది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మెద‌క్ ప‌ట్ట‌ణం న‌వాబుపేట‌కు చెందిన దుర్గాప్ర‌సాద్‌(21) స్థానిక విశాల్ మార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మేనేజ‌ర్ కిర‌ణ్ తీవ్ర ప‌ని ఒత్త‌ిడి పెంచి ఇబ్బందుల‌కు గురి చేసేవాడ‌ని తెలిపారు. మేనేజ‌ర్ వేధింపులు త‌ట్టుకుంటూనే ఉద్యోగం చేస్తున్న దుర్గాప్ర‌సాద్ స్థానిక ఓ షోరూంలో ఉద్యోగానికి ఇంట‌ర్వూకు వెళ్ళాడు.

ఈ విష‌యం తెలుసుకున్న మేనేజ‌ర్ కిర‌ణ్ నీకు ఎక్క‌డ కూడా ఉద్యోగం రాకుండా చేస్తాన‌ని బెదిరించ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన దుర్గాప్ర‌సాద్ వేధింపుల‌కు గురి చేస్తే తాను చ‌స్తాన‌ని మేనేజ‌ర్ కిర‌ణ్‌కు వాట్సాప్‌లో మేసేజ్ పంపించిన‌ట్లు తెలిపారు. దీనికి మేనేజ‌ర్ ఐ డోంట్ కేర్ అంటూ స‌మాధానం ఇవ్వ‌డంతో మంగ‌ళ‌వారం దుర్గాప్ర‌సాద్ పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. వెంట‌నే కుటుంబీకులు మెద‌క్ ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించ‌గా ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ బుధ‌వారం మృతి చెందిన‌ట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విశాల్ మార్ట్ మేనేజ‌ర్ కిర‌ణ్‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ప‌ట్ట‌ణ సీఐ మ‌హేశ్ తెలిపారు.