03-12-2025 08:51:34 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం ముక్టాపూర్ గ్రామ తాజా మాజీ వార్డు మెంబర్ ఆరే సురేష్ తో పాటు 50 మందికి పైగా గంగపుత్ర సంఘ సభ్యులు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అదుముల్ల గంగన్న, గ్రామ సర్పంచ్ అభ్యర్థి అదుముల్ల శ్రీధర్, పట్టణ తాజా మాజీ కౌన్సిలర్ శంకర్ పతి, సీనియర్ నాయకులు సయ్యద్, వార్డు మెంబర్లు గజ్జల కృష్ణ, బొమ్మన రాజు, వంజరి శేఖర్, రామిల్లి చిరంజీవి, మరియు గ్రామ పెద్దలు రాజేందర్ రెడ్డి, హర్షద్, లక్ష్మారెడ్డి, పుట్టి పోసులు, తోకల భూమేష్ తో పాటు మండల నాయకులు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.