26 August, 2026 | 3:29 AM

27న కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ధర్నా

26-08-2026 02:09 AM

టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహాధర్నాకు సంబంధించిన అధికారిక నోటీసును మంగళవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ గౌస్ ఆలంకు అందజేశారు.

ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. 27న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జరిగే మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సెక్రెటరీ జనరల్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘేం లక్ష్మణరావు, అడ్ల అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కేశవరెడ్డి, ఉస్మాన్ పాషా, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ అరవింద సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, శారద సునీత, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, కోట రామస్వామి, తదితరలు పాల్గొన్నారు.