25 June, 2026 | 1:31 AM

ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

25-06-2026 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, జూన్ 24 (విజయక్రాంతి): ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఐకెపి, డిఆర్డిఏ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.263 మంది ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరంలో రక్త పోటు, షుగర్, ఈసీజీ, 2 డి ఎకో, కంటి పరీక్షలు నిపుణులు అయినా వైద్యులు చేపట్టారు. ఆరోగ్య శిబిరం లో యశోద ఆసుపత్రి వైద్య బృందంతోపాటు నిజాంబాద్ మాక్స్ విజన్ కంటి ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి, డిఆర్డిఓ దామోదర్ రెడ్డి, అదనపు డిఆర్డిఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.