25 June, 2026 | 1:31 AM

ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకం పెరగాలి

25-06-2026 12:00 AM

అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్ 

జిన్నారం/ అమీన్‌ఫూర్, జూన్ 24 : గ్రా మీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకం పెరిగేలా ఉపాధ్యాయు లు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.  జిన్నారం మున్సిపల్ ప రిధిలోని శివానగర్ గ్రామంలో న్యూల్యాండ్ పరిశ్రమ 60 లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో నిర్మించిన జడ్పీహెచ్‌ఎస్ అదనప తరగతి గదులను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యావ్యవస్థల బలోపేతానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న క్షేత్రస్థాయిలోని కొన్ని పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శివానగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య అతి తక్కువగా ఉండటం పట్ల అసహ నం వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి ప్రభు త్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలను వి వరించి అడ్మిషన్లను పెంచాలని ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం న్యూలాండ్ పరిశ్రమ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అంగన్వాడి, ప్రాథమిక పాఠశాల భవనాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చై ర్మన్ ప్రతాపరెడ్డి, స్థానిక కౌన్సిలర్ కృష్ణ, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్‌ఫూర్, జూన్ 24 : పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం డివిజన్ పరిధిలోని వైయస్సార్ కాలనీలో నూతనంగా నిర్మించిన చిత్తారమ్మ దేవాలయంలో బుధవారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాల తో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మాజీ జడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, చంద్రారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, ఆల య ధర్మకర్తలు పాల్గొన్నారు.