calender_icon.png 15 August, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెండా వందనాన్ని అవమానించిన ఉద్యోగులు

15-08-2025 12:24:16 PM

మన్మోహన్ సింగ్ విశ్వవిద్యాలయంలో హాజరుకాని ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు. 

ఈ ఈ ఈ సిబ్బంది తప్ప ఎవరు హాజరు కాలేదు. 

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): యావత్ భారతదేశం ఆగస్టు 15న భక్తిశ్రద్ధలతో జండా వందనం నిర్వహించి, జాతీయ జెండాకు వందన సమర్పణ నిర్వహించి,  త్యాగధనులను  మననం చేసుకునే పవిత్ర పండగను అవమానించి అగౌరవరపరిచారు ప్రభుత్వ ఉద్యోగులు కొందరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కె ఎస్ ఎం కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం(Manmohan Singh Earth Science University)లో నిర్వహించిన మొట్టమొదటి జెండా వందనం కార్యక్రమానికి ఈ ఈ ఈ డిపార్ట్మెంట్ కు చెందిన సిబ్బంది మినహా మన్మోహన్ సింగ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, కాంట్రాక్టర్ లెక్చరర్లు కనిపించకపోవడంగమనార్హం. వారి గైరహాజరకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.యాజమాన్యం మొదట హెచ్చరించినప్పటికీ సిబ్బంది పెడచవని పెట్టడం, జాతీయ పండుగను అవమానపరిచిన వైనంగా దేశభక్తులు పరిగనిస్తున్నారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఈ అంశంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.