calender_icon.png 12 December, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్న ఉద్యోగులు

10-12-2025 12:55:01 AM

అయిజ, డిసెంబర్ 9: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకొన్న ఉద్యోగులు.83 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా 77 మంది తమ ఓట్లు వినియోగించుకొన్నారని ఎంపీడీఓ అన్నారు. ఉద్యోగులకు  పోస్టల్ బ్యాలెట్ సమాచారం ఆలస్యంగా అందడం వల్ల, కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడంలో ఇబ్బంది పడ్డామని అన్నారు.

సమాచారం ముందుగా తెలిసి ఉంటే సకాలంలో దరఖాస్తు చేసుకొని  ముందస్తుగా వచ్చి ఓటు వేసే వారమని కొందరు ఉద్యోగులు వాపోయారు. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వారికి ముందుగానే సమాచారం అందుతుంది. అందిన తర్వాత ఆయా గ్రామాల ఉద్యోగులు వచ్చి తమ మండలంలో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు చేసుకున్న తర్వాత పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థులు తమ ఓటును వినియోగించుకోవాలి.

అయితే పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థులకు సమాచారం ఆలస్యంగా తెలిసినదని అన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి కూడా సమయం లేక  కొంతమంది ఇబ్బంది పడ్డారని, దూరాన ఉన్నవారు సకాలంలో రాలేక ఇబ్బంది పడుతున్నారని, కావున అధికారులు మాకు ముందస్తు సమాచారం ఇచ్చిఉంటే బాగుండేదని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అభ్యర్థులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.