10-12-2025 12:53:56 AM
దేవరకద్ర, డిసెంబర్ 9: అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి రోజు రోజుకు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలను వీడి ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈసందర్భంగా భూత్పుర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి దంపతులు, వారి అనుచరులు మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.
కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి సాద రంగా ఆహ్వానించారు. తాటికొండ గ్రామ సర్పంచ్‌గా కల్పన శ్రీధర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే జీఎంఆర్, మన్నె జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాటికొండ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా తమవంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.