31 March, 2026 | 9:14 PM

వ్యవస్థాపకులతో ఉపాధి అవకాశాలు

31-03-2026 07:43 PM

మంథని డిగ్రీ కళాశాలలో శాతవాహన యూనివర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డా. మనోహర్

మంథని,(విజయక్రాంతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనిలో ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పై నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు అయిన మంగళవారం రిసోర్స్ పర్సన్ గా హాజరైన శాతవాహన యూనివర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డా.మనోహర్ మాట్లాడుతూ... వ్యవస్థాపకులతో వ్యాపార అభివృద్ధి అవకాశాలు పెరిగి తద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభించగలదని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు తమ ఆలోచనలతో తయారుచేసిన వ్యాపార అభివృద్ధి ప్రాజెక్టు నివేదికలను పరిశీలించి సూచనలు చేశారు.

తదనంతరం ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డా. జై కిషన్ ఓజా  మాట్లాడుతూ... మూడు రోజుల శిక్షణా కార్యక్రమానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనికి నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లసార్ కు ఉమేష్ కుమార్ కు రిజిస్టార్ సతీష్ కుమార్ సార్ కు యూనివర్సిటీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. రంగ ప్రసాద్, ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. మనోహర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... విద్యార్థులలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ ద్వారా వ్యాపార అభివృద్ధి ఆలోచనలో పెరుగుదలతో స్వయం ఉపాధితో పాటు ఇతరులకు ఉపాధి కలిగించే నైపుణ్యం చేకూరుతుందని తెలియజేస్తూ కళాశాలలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలను ఈ ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలియజేశారు. తదనంతరం శిక్షణ కార్యక్రమానికి హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యుఏసి శిక్షణ కార్యక్రమ కో ఆర్డినేటర్ కృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ పరశయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మీనారాయణ, చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ ,ణణఘ అధ్యాపకులు అమర్నాథ్, ముకుందం, ఫర్జానా, మానస, రజిత, దుర్గం కృష్ణ, శేఖర్, శ్రీధర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.