13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శాసనమండలిలో జవహర్ నగర్ వాణి

31-03-2026 07:47 PM

గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి

కోర్టు కేసులో ఉన్న స్థలాన్ని కాపాడి పాఠశాల నిర్మించాలి

పత్రికా కథనాలపై స్పందించిన ఎమ్మెల్సీ

స్పీకర్ కు ఎమ్మెల్సీ సత్యం విజ్ఞప్తి

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని పేద పిల్లల చదువుకు దూరం అవుతున్నారని జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం స్పీకర్ కు విన్నవించారు. నగర శివారు ప్రాంతమైన జవహర్ నగర్ సమస్యలపై శాసనమండలిలో నెల్లికంటి సత్యం మాట్లాడంపై జవహర్ నగర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల పత్రికలలో వచ్చిన కథనాలపై ఎమ్మెల్సీ సత్యం స్పందిస్తూ, మూడు లక్షల జనాభాకు రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలే ఉండడం దారుణమని ప్రపంచం ఆధునిక టెక్నాలజీ వైపు పయనిస్తుంటే కార్మికుల పిల్లలు బాల కార్మికులు గాని మారుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చెర నుండి కాపాడి కోర్టు కేసులను పరిష్కరించాలి.

ఎమ్మెల్సీ సత్యం మాట్లాడడంపై ప్రజలు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఘనంగా నిర్మిస్తామంటున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ జవహర్ నగర్ లోని గబ్బిలాల పేట ప్రాంతంలో ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదువుతోనే జీవితం మారుతుందని బాల్యాన్ని బడిలోనే గడపాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ సత్యం జవహర్ నగర్ లో ప్రభుత్వ పాఠశాల సమస్యపై మాట్లాడడంతో వెంటనే పరిష్కారం కావాలని ఆశిస్తున్నామని జవహర్ నగర్ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.