ఉపాధి పనులు పారదర్శకంగా జరగాలి
27-05-2026 12:15 PM
కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
అచ్చంపేట: నియోజకవర్గంలోని బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న రోడ్డు చదును పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు, వేతనాల చెల్లింపులపై ఆరా తీశారు. కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులను పారదర్శకంగా నిర్వహించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు.






