ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సలైట్లు మృతి
15-06-2024 02:39 PM
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని అభుజ్మద్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారు. నారాయణపూర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ అనే నాలుగు జిల్లాలకు చెందిన భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా శనివారం ఉదయం అభుజ్మద్ అడవిలో జరిగిన కాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.






