19 August, 2026 | 8:15 AM

అలకనంద నదిలో పడిన టెంపో... 10 మంది మృతి

15-06-2024 03:14 PM

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్ లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా..  ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్ ని ప్రార్థిస్తున్నాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించినట్లు తెలిపారు.