8 April, 2026 | 6:25 PM

ములుగు జిల్లాల్లో భారీ ఎన్ కౌంటర్

01-12-2024 09:51 AM

హైదరాబాద్: తెలంగాణలోని ములుగు జిల్లాల్లో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఏటారునాగారం మండలం చల్పాల అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు, ఇతర నేతలు ఉన్నట్లు సమాచారం. బద్రు ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. దట్టమైన అడవిలో గ్రేహౌండ్స్ యూనిట్, మావోయిస్టులతో తీవ్ర కాల్పులకు తెగబడటంతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో రెండు ఎకె-47 రైఫిళ్లు, వివిధ పేలుడు పదార్థాలతో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారిని బద్రు(35), మధు(43), కరుణాకర్(22), జైసింగ్(25), కిషోర్(22), కామేశ్(23), జమున(23)గా గుర్తించారు. నవంబర్ 22న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇదే విధమైన ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుదెబ్బలు తగిలడంతో తెలంగాణలో మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారన్న ఆందోళనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.