31 July, 2026 | 12:19 PM

లంగర్‌హౌజ్‌లో విషాదం.. దంపతులు మృతి

01-12-2024 09:58 AM

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి 

మద్యం మత్తులో కారుతో బైక్ను ఢీకొట్టిన డ్రైవర్ 

కార్వాన్, విజయక్రాంతి : లంగర్ హౌస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తి బైకుతో పాటు ఆటోటోరిక్షాలను ఢీకొన్న ఘటన లంగర్ హౌస్ లో ఆదివారం తెల్లవారుజామున  చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఓ టూ వీలర్ వాహనాన్ని ఢీకొట్టాడు. అనంతరం ఆటోను కూడా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో టూ వీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ జిల్లా దొంగ మండలం మోత్కూరు గ్రామానికి చెందిన ప్రణయ్ మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.