17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మేడిపల్లి రెవిన్యూ పరిధిలోని సర్వే నెం.103లో భూ ఆక్రమణను నిలిపివేయాలి

09-10-2025 10:10 PM

ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసిన ప్రజా సంక్షేమ సంఘం నాయకులు..

మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపాలిటి కార్పోరేషన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా 14వ డివిజన్లో మేడిపల్లి రెవిన్యూ పరిధిలోని సర్వే నెం.103లో భూ ఆక్రమణనలు జరుగుతున్నవి. దొంగ పట్టాలను తయారుచేసుకొని ఇండ్లు లేకున్న పట్టాలపై బై నెంబర్లు వేసుకొని ఇంటి నెంబర్లు తెచ్చుకొని దానిని సేల్డీడ్ గా మార్చుకుని అమ్ముకుంటున్నారు. గతంలో మాజీ మంత్రి టి. దేవేందర్ గౌడ్ 179 పట్టాలు నిరుపేదలకు పంచారు. ఈ పట్టాలను ఆసరా చేసుకుని భూ ఆక్రమదారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయము గురించి గతంలో గ్రామ ప్రజలు ఎన్నో పిర్యాదులు చేసినప్పటికి ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న ధాఖలాలు లేవు.

కావున భూ ఆక్రమనదారులను గుర్తించి వారి చెర నుండి భూమిని తిరిగి తీసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, అవసరాలకు వినియోగించాలని అన్నారు. మేడిపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థాన పరిదిలో ఉన్న స్థలంలో ప్రభుత్వ ప్రతిపాదిత ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటును కూడా విరమించుకోవాలని ప్రజా సంక్షేమ సంఘం నాయకులు మేడిపల్లి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తూళ్ళ బిక్షపతి గౌడ్, ఉడుతల బాలకృష్ణ గౌడ్, దేవ్ సింగ్ నాయక్, అశోక్ గౌడ్, జైపాల్ రెడ్డి, సంతోష్ గౌడ్, వెంకటేశ్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.