09-10-2025 10:12:26 PM
కొండపాక: కొండపాకలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోనే రికార్డులను పరిశీలించారు. భోజన సరుకులను పరిశీలించి, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, రాత్రి భోజనాన్ని తనిఖీ చేశారు. పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని సూచించారు.