17 May, 2026 | 5:00 AM

రామిరెడ్డికి ఎండోస్కోపీ నవాచార్ పురస్కారం

23-04-2024 01:02 AM

ఆయన చేసిన ఆవిష్కరణకు గుర్తింపుగా అవార్డు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రామిరెడ్డి ప్రతిష్టాత్మకమైన భారత్ ఎండోస్కోపీ నవాచార్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎండోకాన్ దేశంలో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ అవార్డు రామిరెడ్డిని వరించింది. నోవో జీ ఎంటరల్ ఫీడింగ్ ట్యూబ్, కాంపోజిట్ పాలిపెక్టమీ స్నేర్ నావెల్ టెక్నిక్‌తో ఎండోస్కోపీలో ఆయన చేసిన వినూత్నమైన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. రామిరెడ్డికి పురస్కారం లభించడం పట్ల స్టార్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, యాజమాన్యం అభినందనలు తెలిపారు. వినూత్నమైన కృషితో వైద్య రంగంలో సరికొత్త రామిరెడ్డి ప్రమాణాలను నెలకొల్పారని, భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. ఆయన పరిశోధనలు భవిష్యత్తులో అనేక మంది వైద్యులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.