జేఈఈ మెయిన్స్ కీ విడుదల
23-04-2024 01:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : జేఈఈ మెయిన్స్ సెషన్ పరీక్షల ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న జేఈఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నా.. అంతకన్నా ముందే విడుదల చేసేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు స్కోర్ కార్డును పొందవచ్చు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్స్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు.






